‘జై లవ కుశ’ కోసం మరో పాత్రలో ఎన్టీఆర్‌..

‘జై లవ కుశ’ సినిమా ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలను చేసిన ఎన్టీఆర్ నాలుగో పాత్రను కూడా పోషించాడట .. అదే పర్యవేక్షణ. ఈ సినిమా సెట్స్ లో బాబీ నామమాత్రపు పాత్ర పోషించాడని సమాచారం. సెట్స్‌లో చిత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అన్నతమ్ములు తారక్, కళ్యాణ్ రామ్ లే చూసుకున్నారని తెలిసింది.

Jai Lava Kusa Movie less CG work And Latest Technology

అదే విధంగా గ్రాఫిక్స్ విషయంలోను ఎన్టీఆర్‌ పర్యవేక్షణ ఉందట. కెమెరా ముందే కాకుండా… కెమెరా వెనుక కూడా ఎన్టీఆర్ తన ప్రతాపం చూపించాడని తెలుస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించి గ్రాఫిక్ వర్క్ చాలా కీలకంగా మారింది. ఈ విభాగంలో కూడా ఎన్టీఆర్ అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు పాత్రలకే పరిమితం కాకుండా ఈసినిమా ఫలితం ఏదైనా అందుకు తాను పూర్తి బాధ్యతను వహించేంతగా దర్శకత్వం పరంగా నాలుగో పాత్రను కూడా పోషించారని.. ఫిలిం వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో వాస్తవమెంతో గాని .. ఇప్పుడంతా ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు.