‘మా’ ఇంట్లో జై లవ కుశ టీం..!

Jai Lava Kusa Promotions in Bigg Boss

‘స్టార్ మా’ ఛానల్ లో ప్రసారమవుతోన్న ‘బిగ్ బాస్’ షో బుల్లితెర ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. వీకెండ్స్ లో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తోన్న ఎన్టీఆర్ తనదైన స్టైల్లో సందడి చేసేస్తున్నాడు. కొత్త సినిమాల ప్రమోషన్స్ కి కూడా ఈ షో ఒక వేదికగా నిలిచిందనే సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన “జై లవ కుశ” సినిమా ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా యంగ్‌టైగర్‌ సినిమా ప్రచారంలో బిజీ అయిపోయాడు.

Jai Lava Kusa Promotions in Bigg Boss

యంగ్ టైగర్ మొదటి సారి “జై లవ కుశ” అనే సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్‌ దగ్గరపడతుండడంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు హైప్ తెచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ట్రైలర్స్‌తో సాంగ్స్‌తో వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ అలాగే బుల్లి తెర ప్రేక్షకులను కూడా థియేటర్స్ వరకు రప్పించేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ షోతో వారికి ఎన్టీఆర్ బాగా దగ్గరయ్యాడు. ఈ షోలో సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతకుముందు చాలా మంది నటీనటులు వచ్చిన విషయం తెలిసందే.

Jai Lava Kusa Promotions in Bigg Boss

కానీ తాను హోస్ట్ చేస్తున్న షోలోనే ఎన్టీఆర్ మొదటి తన సినిమా ప్రమోషన్స్ ని నిర్వహించబోతున్నాడు. అందుకోసం సినిమాలో నటించిన హీరోయిన్స్ రాశి ఖన్నా – నివేద థామస్ రీసెంట్ గా బిగ్ బాస్ షోలోకి ఆహ్వానించాడు ఎన్టీఆర్. అయితే ఆ ఎపిసోడ్ ఈ శనివారం ప్రసారం కాబోతోంది. ఈ శని ఆదివారపు ఎపిసోడ్ లో జై లవకుశ స్థాయిని ఇంకా పెంచేలా ఎన్టీఆర్ సూపర్బ్ గా షోని నడిపించాడని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ చాలా హిట్ అవుతుందని షో నిర్వాహకులు కూడా నమ్మకంతో ఉన్నారు.