జైలవకుశ నాన్‌ బాహుబలి రికార్డ్‌

The trailer of Junior NTR's Jai Lava Kusa released on Sunday and Twitter's loving it

జూనియ‌ర్ ఎన్టీఆర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వకుశ‌. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండగా సినిమా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ఎన్టీఆర్‌ సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. ఇందులో ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ లుక్‌లతో క‌నిపించి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు. ఈ ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా అన్ని వ్యూస్‌ దక్కించుకున్న రెండో చిత్ర ట్రైలర్‌ ఇదేనట. ఈ వరుసలో ‘బాహుబలి’ ట్రైలర్‌ మొదటి స్థానంలో ఉన్నట్లు మూవీ ట్రాకర్‌ రమేశ్‌ బాలా ట్వీట్‌ చేశారు. దీని తర్వాతి స్థానంలో ‘జై లవకుశ’ ట్రైలర్‌ నిలిచిందన్నారు.

‘ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’ అంటూ ‘జైలవకుశ’ ట్రైలర్‌లో అదరగొట్టాడు ఎన్టీఆర్‌. ‘‘జై లవకుశ’ ట్రైలర్‌కు వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఎన్టీఆర్ అన్నాడు. అందరికీ ధన్యవాదాలు. ‘గతంలో చెప్పినట్లుగానే.. నా నటనతో మీ అందరూ (అభిమానులు) తృప్తి చెందే విధంగా కష్టపడతా’ అని అన్నారు.

బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటు మూవీ యూనిట్ అంద‌రు సినిమా భారీ విజ‌యం సాధిస్తుంద‌నే హోప్స్ తో ఉన్నారు. నంద‌మూరి ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టించారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.