డిసెంబర్ 23న బాలయ్య.. జై సింహా

jai simha Audio at Vijayawada..!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జై సింహా. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. బాలయ్య సరసన  నయనతార, హరిప్రియ, నటాషా దోషీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రెండు వైవిధ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండటంతో ఆడియో విడుదల కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. క్రిస్మస్ కానుకగా  డిసెంబర్ 23న విజయవాడలో సినిమా పాటలను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుక కార్యక్రమంలో ‘జై సింహా’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య కెరియర్‌లో 102 చిత్రం ‘జై సింహా’.  పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.సికళ్యాణ్ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలను సమకూర్చుతున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.