జయ జానకి నాయక హిట్ ఖాయం…

boyapati-srinu jaya

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తమ హీరోలు మాస్‌ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటారు. అంతగా ఆయన హీరోల హీరోయిజానికి బిల్డప్‌ ఇస్తాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమా ప్రేమికులంతా ఈ నెల 11వ తేదీపై ఆసక్తిని చూపుతున్నారు. ఎందుకంటే ఆ రోజున ‘నేనే రాజు నేనే మంత్రి’ .. ‘లై’ .. ‘జయ జానకి నాయక’ చిత్రాలు విడుదల కానున్నాయి. గట్టిపోటీ ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ కంటెంట్ పై నమ్మకంతో వున్నారు. బోయపాటి మాటల్లోను అదే ధీమా వ్యక్తమవుతోంది.కొన్ని సినిమాలను చూసి వెళిపోతుంటాం.. తరువాత ఆ సినిమాకోసం మరిచి పోతాం అని ‘జయజానకి నాయక’ అలా కాదని ఖచ్చితంగా ప్రేక్షకులగుండెల్లో పెట్టుకునే మంచి సినిమా అన్నారు. ‘జయ జానకి నాయక’ కొత్త జోనర్లో తెరకెక్కిందని బోయపాటి అన్నారు.

తాను ఇంతవరకూ తెరకెక్కించిన సినిమాలకి ఇది ఒక మెట్టు పైనే ఉంటుందని చెప్పారు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని అన్నారు. కథాబలమున్న సినిమా కనుకనే తాము భయపడవలసిన అవసరం లేదని చెప్పారు. బాలకృష్ణ.. బన్నీ లాంటి స్టార్‌ హీరోలతో బోయపాటి పోటికి దిగడంలో అర్ధం ఉంది కానీ ఇక్కడ ఉన్నది బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. హీరోగా ఇంకా తొలి అడుగులు వేసే దశలోనే ఉన్నాడు. అలాంటి హీరోతో బోయపాటి రంగంలోకి దిగడం సాహసమనే చెప్పాలి.

అయినా బోయపాటి తన కథపై తనకు పూర్తి విశ్వాసం ఉందని సినిమా రేసులో నిలబడుతుందని ధీమాతో ఉన్నారు. దాదాపు ఈ సినిమా 700 థియేటర్స్ లో విడుదలవుతుంది గనుక, భారీ ఓపెనింగ్స్ ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.