సినిమా చూశాకే నిద్రపోతాడట..!

Jogendra is a self-assured king
Jogendra is a self-assured king

రానా అలియాస్ జోగేంద్ర తన తాజా చిత్రంతో థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాడు . తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రాన్ని చేసిన రానా ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎలాంటి ట్వీట్లు పెట్టినా వాటన్నింటికీ ఓప్పిగ్గా రానా రిప్లై ఇస్తూనే ఉన్నారు. దాంతో కేథరీన్‌ అనే అభిమాని రానాకి ట్వీట్‌ చేస్తూ.. అసలు రానా సరిగ్గా నిద్రపోతారా? ప్రచార కార్యక్రమాలు, షూటింగ్‌లతో ఓ యంత్రంలా పనిచేస్తున్నారు. అసలు ఆయనకి 8 గంటల నిద్ర ఉంటోందా? అని రానాకి ట్వీట్‌ చేసింది. దీనికి రానా రిప్లై ఇస్తూ.. మీరంతా సినిమా చూశాకే నేను నిద్రపోతాను అని సమాధానమిచ్చారు.

ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రీ రిలీజ్ బిజినెస్ లో భారీ మొత్తాన్ని పలికినట్టుగా తెలుస్తోంది. ‘బాహుబలి-2’ తర్వాత రానా సోలో హీరోగా ఈ సినిమాతో లక్ ను పరీక్షించుకుంటున్నాడు. ప్రత్యేకించి బాహుబలి-2 తర్వాత వస్తున్నది కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ భారీ స్థాయిని రీచ్ అయ్యిందని సమాచారం. ఈ సినిమా తమిళ, మలయాళ, హిందీ అనువాద హక్కులు, ఆ భాషలకు సంబంధించిన శాటిలైట్ రైట్స్.. ఇలా ఈ వ్యాపారం అంతా కలిసి 25 కోట్ల మార్కును రీచ్ అయినట్టు సమాచారం. తెలుగుతో సంబంధం లేకుండానే ఈ సినిమా పాతిక కోట్ల వ్యాపారాన్ని చేసినట్టుగా తెలుస్తోంది.