ఎన్టీఆర్ బ‌ర్త్ డే వేడుక‌ల్లో వాళ్లిద్ద‌రి ఫోటోలు హ‌ల్ చ‌ల్..

jr ntr birthday celebrate grandley..he says first wishes to my son abhay ram

టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ త‌న పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకున్నారు. కుటుంబ స‌భ్యులతో, మిత్రుల‌తో, ఫ్యాన్స్ తో బ‌ర్త్ డే ను ఎంజాయ్ చేశాడు తార‌క్. నిన్న నిన్న‌టితో అత‌ను 35వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టాడు. త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మొద‌టి విషెస్ ను త‌న కుమారుడు అభ‌య్ రామ్ నుంచి స్వీక‌రిస్తాన‌ని తెలిపారు ఎన్టీఆర్. అభ‌య్ రామ్ నుంచి పుట్టిన‌ప్ప‌టి నుంచి నాకు ఇదోక ఆన‌వాయితిలా మారిపోయింద‌న్నారు ఎన్టీఆర్. త‌న జ‌న్మిదిన వేడుక‌ల్లో భాగంగా ఎన్టీఆర్ త‌న కొడుకును భుజాల‌పై ఎత్తుకున్న ఫోటో ఒక‌టి త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.’ భుజాలమీదకు ఎత్తుకున్న ప్రతీసారి అభయ్ నా కళ్లు మూసేవాడు.

jr ntr birthday celebrate grandley..he says first wishes to my son abhay ram

ఈసారి ఆ పని చేయడం మానుకున్నాడు. వాడు ఎదుగుతున్నాడు. అభయ్ నుంచి ఫస్ట్ విషెష్ అందుకోవడం ఆనందంగా ఉంది’ అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఆఫోటోతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్ర‌తిసారి లాగే ఈసారి కూడా త‌న కుమారుడు త‌న‌కు ఫ‌స్ట్ విషెస్ చెప్పాడ‌ని..అయితే పోయిన సంవ‌త్స‌రం లా అభ‌య్ నా క‌ళ్ల మూసి విషెస్ చెప్పాడు…ఈసారి అలా కాకుండా నా క‌ళ్లు మూయ‌కుండా త‌న‌కు విషెన్ చెప్పాడ‌ని ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ్ కుడా ఆయ‌న‌కు విషెష్ చెప్పారు.

jr ntr birthday celebrate grandley..he says first wishes to my son abhay ram

బ‌ర్త్ డే వేడుక‌ల్లో ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఫోటోను త‌న ట్వీట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు రామ్ చ‌ర‌ణ్ . పుట్టిన రోజు శుభాకాంక్షాలు సోద‌రా..ఈ ఏడాది కూడా నీకు మంచి విజ‌యాలు రావాలి అంటూ పోస్ట్ చేశాడు రామ్ చ‌ర‌ణ్. ఎన్టీఆర్ బ‌ర్త్ డేలో విరిద్ద‌రూ క‌లిసి దిగిన ఫోటోతో రాం చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ ఫ్యాన్స్ పుల్ హ్యాపిగా ఉన్నారు. ఎన్టీఆర్ బ‌ర్త్ డేను అత‌ని ఫ్యాన్స్ ప‌లు చోట్ల కేక్ లు క‌ట్ చేసి సంబ‌రంగా చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల‌లో అన్న‌దానాలు, ర‌క్త‌దానాలు, పుస్త‌కాల పంపిణీ వంటి సేవా కార్య‌క్ర‌మాలు చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తో అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఇటివ‌లే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.