ఈ జన్మంతా ఫ్యాన్స్‌తోనే ఉండిపోతా…

Jr NTR Emotional Speech at Jai Lava Kusa Audio Press

‘జై లవ కుశ’ ప్రీ రిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘నాన్నా.. ఈ జన్మ అభిమానులతో ఉండిపోతాను. మరో జన్మలో మీ రుణం తీర్చుకుంటాను’ అంటూ తండ్రి హరికృష్ణ తో భావోద్వేగంతో అన్నాడు ఎన్టీఆర్. ‘ఈ సినిమా చూసి ఎంత బాగా తీశారని అభిమానులు అనుకోవాలి..తల్లిదండ్రులు అనుకోవాలి.. అన్నాడు.

ntr speech in jai lava kusa audio

ఈ చిత్రం కథ విన్న తర్వాత అద్భుతంగా ఉందని బాబీకి చెప్పాను. ఆ తర్వాత ఈ కథ గురించి ఒక ఇద్దరి వ్యక్తులతో పంచుకున్నాను. వాళ్లిద్దరూ కూడా ‘కథ చాలా బాగుంది’ అని చెప్పారు. అయితే.. వాళ్లిద్దరి పేర్లు ఇప్పుడే చెప్పను. ఈ సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ల పేర్లు చెబుతాను. ఈ సినిమా మీకు నచ్చుతుందని..బాగుంటుందని.. హిట్టవుతుందని నా నమ్మకం…ఈ చిత్రం తప్పకుండా మన గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందనే నమ్మకం నాకుంది… ‘జై లవ కుశ’ సినిమా కేవలం ‘జై’ ఒక్కడి సినిమా కాదండి. ఈ చిత్రం జై, లవ, కుశ..ఈ మూడింట్లో ఏ ఒక్క పేరు పోయినా కరెక్టవదు. ఈ చిత్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ అంకితం. ఈ చిత్రం చూసి అన్నదమ్ములందరు కూడా ఇన్ స్పైర్ అవుతారని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా’ అని తన ప్రసంగాన్ని ముగించాడు జూనియర్ ఎన్టీఆర్ .

కాగా, అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రంలోని ఓ డైలాగ్.. ‘ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాల..ఈ రావణుడ్ని సంపాలంటే సముద్రమంత ద ద దా.. దా..దైర్యముండాల.. ఉందా!’ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో చప్పట్లు మార్మోగిపోయాయి.