ఇది బూతు సినిమా కాదు..!

Julie 2 Theatrical Trailer

వెండితెరపై  అందాల భామలుగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో రాయ్ లక్ష్మి ఒకరు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా రాయ్ లక్ష్మి మంచి మార్కులు కొట్టేసింది. చిరుతో ఖైదీ నెంబర్ 150లో ఐటెం సాంగ్ చేసిన ఈ భామ తాజాగా జూలి 2 అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ ‘జూలి’కి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు. అక్టోబ‌ర్ 6న ఈ సినిమా థియేట‌ర్స్ లోకి రానుంది. ఇందులో రాయ్ త‌న అందాల‌తో యూత్ కి మ‌త్తెక్కిస్తుంది.

ఈ నేపథ్యంలో లక్ష్మి చాలా హాట్ గా కనిపిస్తోందని … అడల్ట్ సినిమా అని వస్తున్న వార్తలపై స్పందించింది రాయ్ లక్ష్మీ.  తమ సినిమాను శృంగార చిత్రం అంటే ఒప్పుకోమని చెబుతోంది.  సినిమాలో చాలా కంటెంట్ ఉందని, ఎన్నో ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని.. అలాంటప్పుడు కేవలం శృంగార చిత్రం అని ఎలా అంటారని ఈ మోడ్రన్ జూలీ ప్రశ్నిస్తోంది.

ఈ సినిమాలో ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు . బాలీవుడ్ లో ఉన్న అండ‌ర్ వ‌ర‌ల్డ్, రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుంది.