రజనీ… కాలా సెన్సార్ పూర్తి

kaala

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలా’. ‘కబాలి’ చిత్రానికి దర్శకత్వం వహించిన పా.రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించారు. రజినీకాంత్ అల్లుడు ధనుష్ సమర్పణలో ఉండర్‌బార్ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘కబాలి’లో కొత్త రజినీకాంత్ చూపించిన దర్శకుడు రంజిత్.. ఇప్పుడు ‘కాలా’లోనూ తలైవాను డిఫరెంట్‌గా చూపిస్తున్నారు. జూన్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్‌. ఫస్ట్ లుక్ విడుదలైన నాటి నుంచే ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌తో సూపర్ స్టార్ స్టామినా ఎంటో మరోసారి రుజువు చేశారు తలైవా.

ఈ మూవీలో రజినీని సరికొత్త గెటప్‌లో చూపించాడు దర్శకుడు. నల్లటి దుస్తువులతో కనిపించే ఆయన డ్రెసింగ్ సూపర్భ్ అనిపిస్తుంది. ఇంతకుముందు రజనీ చేసిన మాఫియా లీడర్ పాత్రే అయినప్పటికీ, పూర్తి డిఫరెంట్ గా ఈ పాత్రను మలిచాడని అంటున్నారు. ఈ సినిమాతో రజనీకాంత్ కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమంటూ ఆయన అభిమానులు బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.