రివ్యూ: కాలా

kaala review

సూపర్ స్టార్ రజనీకాంత్-పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాలా. రజనీ అల్లుడు ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చింది. రజనీ-రంజిత్ కాంబోలో వచ్చిన కబాలి భారీ హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల అంచనాలను నిజం చేస్తూ రజనీ మరోసారి మ్యాజిక్ చేశాడా..?పా రంజిత్ సక్సెస్ కొట్టాడా లేదా చూద్దాం..

క‌థ‌:

తిరున‌ల్ వేలికి చెందిన క‌రికాల‌న్‌(ర‌జ‌నీకాంత్‌) కొన్ని పరిస్ధితుల కారణంగా ముంబైలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్క‌డే జ‌రీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ అనుకోని పరిస్ధితుల్లో కాలా సెల్వి(ఈశ్వ‌రీరావు)ను పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ ఉండే ప్రజలు అందరూ అన్నదమ్ముల్లా కలిసిఉంటారు. అయితే ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు హరినాథ్ దేశాయ్ (నానా పటేకర్) ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తాడు. వీటిని కాలా ఏ విధంగా ఎదుర్కొన్నాడు. ప్రజలను ఒక్కటి చేసి ఏ విధంగా పోరాడాడు అన్నదే సినిమా కథ.

kaala
ప్ల‌స్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ రజనీ,కథ,సినిమాటోగ్రఫీ,పా రంజిత్ దర్శకత్వం. ప్రతీ ఫ్రేమ్‌లో రజనీ చరిష్మా, స్క్రీన్ ప్రజెన్స్ వెండితెర మీద గ్రాండ్‌గా కనిపిస్తుంది. యాక్షన్ సీన్లు సూపర్బ్‌గా ఉంటాయి. రజనీ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తరకంగా ఉంది. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన తన మార్క్ డైలాగ్‌లతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాడు. ఫ్లాష్ బ్యాక్‌లో హ్యూమాతో ర‌జ‌నీకాంత్ ప్రేమ‌.. విఫ‌లం చెంద‌డం.. ఈశ్వ‌రీరావు, ర‌జ‌నీ మ‌ధ్య స‌న్నివేశాలు బావున్నాయి. ఈశ్వ‌రీరావు న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. సినిమా బ్రిడ్జ్‌ఫై వ‌చ్చే ఫైట్‌, ఇంట‌ర్వెల్ బ్లాక్‌, కోర్ పాయింట్ అన్నీ మెప్పిస్తాయి. నానా పటేకర్‌ సైతం రజనీకి ఏమాత్రం తీసిపోకుండా నటించి మెప్పించాడు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్,ఫస్టాఫ్. పాటల్లో తెలుగు నేటివిటి మిస్సవడంతో అస్సలు అర్ధం కావు. ర‌జ‌నీకాంత్ వంటి మాస్ హీరోను.. హీరోయిజాన్ని ఇంకా ఎలివేట్ చేయాల‌నిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా వెండితెర మీద కొత్త ఆవిష్కరణ కాలా. ముర‌ళి.జి సినిమాటోగ్ర‌ఫీ ప్రేక్షకుడికి గొప్ప ఫీలింగ్‌ను కలుగజేస్తుంది. ధారవి మురికివాడ సెట్ ఆకట్టుకొంటుంది. ఎడిటింగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్. పారంజిత్ దర్శకత్వానికి వంకపెట్టలేం.రజనీ చరిష్మాకు తగ్గట్టుగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. దక్షిణాదిలో ఇప్పటివరకు ఇంతగా భావోద్వేగానికి గురిచేసే చిత్రం రాకపోవచ్చు. ధనుష్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

nana patekar

సమీక్ష‌:

కబాలి తర్వాత మరో మాస్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ కాలాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు రజనీ. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ముంబైలోని ఓ మురికివాడ నేపథ్యంగా సాగుతుంది. క‌రికాలుడుగా ర‌జ‌నీకాంత్ త‌న‌దైన మాస్ పెర్‌ఫార్‌మెన్స్‌తో ఆక్టుకున్నారు. సినిమా అంతా తానై నడిపించాడు. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలైట్‌. స్లో నెరేషన్,ఫస్టాఫ్‌పై దృష్టి పెడితే బాగుండేది. ఓవరాల్‌గా మాస్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించిన కాలా రజనీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలచే మూవీల్లో ఒకటిగా నిలవనుంది.

విడుదల తేది:07/06/2018
రేటింగ్:3.25/5
నటీనటులు: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి
సంగీతం: స‌ంతోశ్ నారాయ‌ణ్‌
నిర్మాత‌: ధ‌నుశ్‌
ద‌ర్శ‌క‌త్వం: పా.రంజిత్‌