కొర‌టాల‌కు థ్యాంక్స్ చెప్పిన వ‌సుమ‌తి..

kaira adwani tweet to koratala..

మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా బాలీవుడ్ నటి కైరా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టించిన చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా డీవీవీ దాన‌య్య నిర్మించారు. ఇందులో హీరోయిన్‌గా న‌టించిన‌ కైరా అద్వాణీ తొలి సినిమాతో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న న‌టించే చాన్సు కొట్టేసింది. తాజాగా విడుద‌లైన ఈ సినిమా రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ సినీ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌సంశ‌ల అందుకుంటోంది. విడుద‌లైన రెండవ‌ రోజుకే రూ.100 కోట్ల మార్కు దాటిన చిత్రంగా రికార్డును సృష్టించింది .

kaira adwani tweet to koratala..

అయితే సినిమాలో వ‌సుమ‌తి అనే క్యారెక్ట‌ర్‌లో కైరా అద్వాణీ న‌టించిన విషయం తెలిసిందే. ఇందులో ఈ సినిమాలో నాకు అవ‌కాశం క‌ల్పించిన కొర‌టాల శివ‌కు ధ‌న్య‌వాదాలు అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కోంది ఆమె. నాపై నమ్మకముంచి ‘వసుమతి’ అనే అందమైన క్యారెక్టర్ రాసి, తనకు అవకాశం కల్పించినందుకు కొరటాలకు ఆమె థ్యాంక్స్ తెలిపారు. తొలి సినిమాకే సూపర్ స్టార్ మహేశ్‌తో నటించడం ఓ గొప్ప అనుభూతిని ఇచ్చింద‌ని ఈ అవకాశం ఇచ్చిన కొరటాలకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదంటూ కైరా ఆద్వానీ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.