జోగేంద్ర లాంటి భర్త వద్దే వద్దు…

Kajal about Nene Raju Nene Mantri

తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగుతున్న హీరోయిన్ కాజల్. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కాజల్..వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఐటెం సాంగ్స్, షార్ట్ ఫిలీం అనే తేడా లేకుండా బిజీ బిజీగా ఉన్న కాజల్ ప్రస్తుతం రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

నిజ జీవితంలో జోగేంద్ర లాంటి భర్త కావాలా? అన్న ప్రశ్నకు, తాను వాస్తవ జీవితంలో ‘రాధ’ వంటి అమ్మాయిని కాదని, అందువల్ల తనకు జోగేంద్ర లాంటి భర్త వద్దని కుండబద్దలు కొట్టింది. రాజకీయ నాయకుడిని వివాహం చేసుకునే ఉద్దేశాలు తనకు లేవని చెప్పకనే చెప్పింది.

Kajal about Nene Raju Nene Mantri
బాహుబలి-2 తర్వాత వస్తున్న సినిమాలో రానా హీరోయిజంతో పాటు అద్భుతమైన నటనను కనబరిచారని కాజల్ ప్రశంసించింది. ఇదో వెరైటీ సినిమాగా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. కేథరిన్‌తో తాను నటించిన సీన్లు నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో పెద్దగా లేవని తెలిపింది. కేథరిన్ పరిస్థితులకు వ్యతిరేకంగా మారే పాత్రలో నటించిందని.. అలాంటి పాత్రలు తనకు లభిస్తే తానెంతో హ్యాపీగా నటిస్తానని వెల్లడించింది.

ఈ చిత్రంలో రాధ లేకపోతే జోగేంద్ర ఏమీ చేయలేడని అంటోంది. రాధలో నమ్మకం, మానసిక స్థైర్యం ఎంతో అధికమని, గృహిణి అయినా, భర్తకు వెన్నుదన్నుగా నిలిచి అన్నింటా తోడుంటుందని చెప్పింది. ఈ చిత్రానికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ, పూర్తి రాజకీయ చిత్రం కాదని, ప్రేమ, భార్యాభర్తల బంధం, వారి జీవన ప్రయాణం తదితరాలను ఎన్నింటినో చేర్చారని కాజల్ వెల్లడించింది.