కాజల్… 71 లక్షల ముద్దులు

kajal agawal

కాజల్ అగర్వాల్ అంటే ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారు చొంగ కార్చుకుంటూ చూసేవారు. ఆమె సినిమా వస్తే చాలు చొక్కాలు చించుకుని మరీ టిక్కెట్లు కొనుక్కుని చూసేదాకా వదిలేవారు కాదు. ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమాల్లో అవకాశాలు తక్కువగా వస్తున్నాయనే చెప్పాలి.

kajal agawal

అయితే సినిమాల్లో అవకాశాల సంగతి అటుంచితే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మను ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 7.1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ మరొకరు లేరు. మొదటి సారిగా కాజల్ అగర్వాల్ కే ఇంత సోషల్ మీడియాలో ఇంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో తనను సోషల్ మీడియాలో ఇంత మంది అభిమానులు తనను ఫాలో అవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ముద్దుగుమ్మ వారందరిని సంతోషపరచడానికి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

kajal agarwal

ఏకంగా ఈ ముద్దుగుమ్మ వారందరికి 71 లక్షల ముద్దులు పెట్టింది. అదేంటి కాజల్ అగర్వాల్ ఏంటి.. 71 లక్షల ముద్దులు పెట్టడం ఏంటని అనుకుంటున్నారా.. అవును కాజల్ అగర్వాల్ 71 లక్షల ముద్దులు పెట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ ముద్దులన్నింటిని సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్న వారందరికి అంకితమిచ్చింది. ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నట్లు సెల్ఫీకి ఓ పోజ్ ఇచ్చి.. ఇన్ని లక్షల ముద్దులు పెట్టేశాను అని పోస్ట్ చేసింది. ఈ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు అన్ని రకాల టెక్నిక్స్ పాటించేసే చందమామ.. తనకున్న ఈ ఫాలోయింగ్ ను కమర్షియల్ యాంగిల్ లో కూడా బాగానే వాడేసుకుంటూ ఉంటుంది.