You are here

కాజల్ ఇలా కూడా సంపాదిస్తోంది..

నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం కాజల్ ఎంతలా ప్రచారం చేసిందో చూశారుగా.. . దాదాపు వారం రోజుల పాటు రానాతో కలిసి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు చుట్టేసింది. ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేసింది. అసలు కాజల్‌ ఈ సినిమాను ఇంతలా ఎందుకు ప్రమోషన్‌ చేసిందో తెలుసా…? కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు తెలుగులో పెద్ద సినిమాలు ఏవి చేతిలో లేవు.

సురేశ్ బాబు ఈ సినిమా ప్రమోషన్ కోసం కాజల్ కు ఏకంగా 30 లక్షలు ఇచ్చాడని అంటున్నారు. సురేశ్ బాబు మార్కెటింగ్ చేయడంలో ఎలాంటి ఎత్తులు వేస్తాడో అందరికీ తెలిసిన సంగతే. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు సంపాదించుకోవడంలో సురేశ్ దిట్ట అనే చెప్పాలి. ఈ సినిమాకు కూడా కాజల్ చే ప్రచారం సినిమాకు ప్లస్ అయ్యింది అనే అంటున్నారు.హిందీ సినిమాలకు మాత్రం కాజల్ ఎప్పుడూ ఇలాంటి కండిషన్లు పెట్టలేదు. అవకాశం రావడమే మహాప్రసాదం అనుకుంటూ అక్కడ చేసే బి-గ్రేడ్ సినిమాలకు కూడా బీభత్సంగా ప్రమోషన్ ఇస్తుంది.

కానీ సౌత్ కు వచ్చేసరికి మాత్రం ప్రచారం అంటే అదేదో తనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు మాట్లాడుతుంది. ఎక్స్ ట్రా చార్జ్ చేస్తుంది.కాజల్ ఈ సినిమా ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకుందా లేదో కానీ.. చేతిలో సినిమాలు ఏవి లేకపోయాన సమయంలో డైరెక్టర్ తేజ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు కాజల్ ని హీరోయిన్ గా పెట్టుకోవడం ఇప్పుడు ఇలా ప్రచారం చేయించడం రానా సినిమాకి మంచి ప్లస్ అయ్యింది.  ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పటికైనా కాజల్‌ కు మళ్లీ మంచి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Related Articles