తారక్ తప్ప ఎవరూ చేయలేరు : కళ్యాణ్

‘జై లవ కుశ’ ప్రీ రిలీజ్ ఆడియో వేడుకలో ఈ చిత్ర నిర్మాత, ప్రముఖ నటుడు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..‘జై లవ కుశ’ సినిమాను తారక్ తప్పించి ఎవరూ చేయలేరని అన్నారు.

దర్శకుడు బాబీ ఈ సినిమా టైటిల్ తో సహా స్క్రిప్ట్ ను తనకు వినిపించాడని, పదే పది నిమిషాల్లో ఓకే చేశానని అన్నారు. ఈ సినిమాను ఓకే చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ వారం రోజుల సమయం తీసుకున్నాడని, అలా ఎందుకు చేశాడో, అప్పుడు తనకు అర్థం కాలేదని, ఆ తర్వాత, తనకు అర్థమైందని అన్నారు.

వారం రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రతి డైలాగ్ ను గుర్తుంచుకున్న తారక్, తనకు వినిపించాడని, దీంతో, ఈ సినిమా అంటే తారక్ కు ఎంత ఇష్టమో తనకు అప్పుడు అర్థమైందని అన్నారు. ‘మా తాతయ్య నందమూరి తారక రామారావు గారికి దాన వీర శూర కర్ణ చిత్రం ఎంత పేరు తెచ్చిందో.. తమ్ముడికి ‘జై లవ కుశ’ అంత పేరు తెస్తుంది’ అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.