ఆ వీడియోలో ఉంది గ్రహాంతరవాసి కాదు.. !

karnataka

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. కర్ణాటకలో గ్రహాంతరవాసిని బంధించినట్లు ప్రచారం జరుతోంది. కర్ణాటకలోని జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో గ్రహాంతర వాసులు తిరుతున్నారని, ఈ గ్రహాంతర వాసులు పశువులపై దాడులు చేసి గాయపరుస్తున్నయని, గాయ పడిన పశువులు కొద్ది రోజులకు మరణిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో కలకలం రేపుతోంది.

ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాల ప్రజలు కాపు కాసి… ఓ వింత జీవిని బంధించినట్లు ఆ వీడియోలో చూపించారు. అయితే ఈ వార్త ఉత్తదే అంటున్నారు నెటిజన్లు. కోతికి మేకప్ వేసి గ్రహాంతర వాసిలా మార్చేసి వీడియో తీసారని, కోతి హావబావాలు కనిపించకుండా తెల్లటి మేకప్ తో గ్రహాంతర వాసిలా మార్చేశారని చెబుతున్నారు. చుట్టూ మనుషులు ఉండడంతో ఆ కోతి ఎక్కడికి వెళ్లలేక అలా ప్రవర్తించింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తపై అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కొందరు యువకులు పనిగట్టుకుని ఇలాంటి వీడియోలను క్రియేట్ చేసి జనాలను భయపెడుతున్న విషయం తెలిసిందే.

మన తెలుగు రాష్ట్రాలలో బీహార్ గ్యాంగ్ తిరుగుతుందని, మహిళలను, పిల్లలను చంపేస్తున్నారని కొందరు యువకులు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చూపించిన వీడియోలు ఇప్పటివి కావని, ఎప్పుడో జరిగిన వీడియోలను షేర్ చేస్తూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసులు తేల్చి చెప్పారు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించిన విషయం తెలిసిందే.