ఆదికి కత్తి మహేష్ వార్నింగ్..

Mahesh-Kathi-reacts

మహేష్ కత్తి.. మూవీ క్రిటిక్‌గా ప్రచారంలో ఉండే ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. దీంతో ప్రతి శుక్రవారం విడుదలయ్యే మూవీలకు మహేష్ కత్తి ఎలాంటి రివ్యూలు ఇస్తాడో అని ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. అయితే ఈమధ్య కాలంలో ఈయన ఇచ్చే రివ్యూలు కూడా కాస్త వివాదంగా ఉండటంతో అభిమానుల ఆగ్రహానికి గురౌతున్నాడు.

Kathi-Mahesh-

అయితే తాజాగా కత్తి మహేష్   జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది వేసిన సెటైర్లపై   తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇంతకు ఆదిపై కత్తి మహేష్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారని అనుకుంటున్నారా.. ఇటీవల ప్రసారమైన జబర్ధస్త్ ప్రోగ్రాంలోని  ఓ ఎపిసోడ్ స్కిట్ లో ఆది పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ ముందు పోట్ట వేసుకొని, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ’  అనే పంచ్‌లు వేసాడు. ఈ పంచ్ లు తనను ఉద్దేశించి ఉన్నాయంటూ కనెక్ట్ అయ్యాడు కత్తి. తనకు పొట్ట ఉందని.. బట్ట ఉందని.. మనుషులంతా ఒక్కలా ఉంటారా? అంటూ క్వశ్చన్ వేయటమే కాదు.. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారని.. ఆ ఒక్కొక్కరు ఒక్కో  రకంగా ఉండటమే ప్రపంచమన్నారు. కాస్త భిన్నంగా ఉంటేనే జోర్స్ అయిపోతామా? అంటూ రియాక్ట్ అయిన మహేశ్.. ఒకరు పొడుగ్గా ఉండొచ్చని.. మరొకరు పొట్టిగా ఉండొచ్చని.. నా స్టైల్లో నేను ఉంటానని.. అంత మాత్రానికే అలా అనేస్తారా? అంటూ సోషల్ మీడియా లైవ్ ద్వారా హైపర్ ఆదిని ఏసుకున్నాడు.

mahesh-kathi

తాను జబర్దస్త్ షో  చూడననా, కానీ ఫ్రెండ్స్‌ పంపే లింక్స్ చూస్తే తనకు ఈ విషయాలు తెలిశాయని చెప్పాడు. అది ఒక గొప్ప షో అని కానీ, గొప్ప కామిడీ ఉంటుందని కానీ నేను అనుకోను. మనుషుల మీద వారు వేసుకునే బట్టల మీద కామెడీ చేస్తూ అపహస్యం చేస్తున్న దానిని హాస్యం అనుకొని ఎంజాయ్‌ చేస్తున్నారని అన్నారు.  మనందరి దిగజారుడు తనానికి నిదర్శనం అని షో సాగుతున్న తీరునే విమర్శించాడు.