పవన్‌ పర్యటన పై కత్తి సెటైర్‌..?

Kathi Mahesh comments on Pawan Kalyan Vizag tour

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వైజాగ్‌ పర్యటన పై ఫిల్మ్‌ క్రిటిక్‌ కత్తి మహేష్‌ స్పందిచాడు. పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనపై ఓ ఇంటర్వ్యూలో ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఆడియో రిలీజ్ త్వరలో ఉందని, అలానే ఈ చిత్రం త్వరలోనే విడుదలవుతుందని చెప్పాడు.

ఇదంతా.. ‘ఏక్ పంత్ దో కాజ్’ అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలని, అటు రాజకీయపరంగా , ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతోందని అన్నాడు. అయితే..ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడమనేది తప్పు కాదని, టైమ్‌ తక్కువగా ఉండడం వల్ల రెండింటికి పనికొచ్చే పనే పవన్‌ చేస్తుంటే అంతకన్నా ఏం కావాలని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ ఇప్పటికైనా జనాల్లోకి వెళుతున్నాడని, ఇది పవన్‌కు రెండు రకాలుగానూ ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించాడు కత్తి మహేష్‌. మొత్తానికి కత్తి మహేష్ పవన్‌కి సెటైర్‌ వేశాడా? లేక సపోర్ట్‌ గా మాట్లాడాడా..?

ఇక ఇదిలా ఉంటే..విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పవన్‌ వైజాగ్ లో పర్యటించనున్నాడు.