షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న కేసీఆర్

ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబాని కుటుంబసేమతంగా దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో షిర్డీ ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సీఎంకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

KCR Family visits Shirdi Saibaba

కేసీఆర్‌ వెంట కుటుంబసభ్యులు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఉన్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో కేసీఆర్‌ కుటుంబ సమేతంగా సాయిబాబాను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిర్డీ ఎయిర్‌పోర్టులో మహారాష్ట్రలో నివాసముంటున్న తెలంగాణవాసులు సీఎంకు ఘనస్వాగతం పలికారు.