పనులను వేగవంతం చేయండి:కేసీఆర్

KCR inspect projects work in Karimnagar

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను  పరిశీలించారు. ఉదయమే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తుపాకులగూడెం బరాజ్‌తో పాటు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన కేసీఆర్ అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

వీటితో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, పంపుహౌజ్‌లు, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు జలాల తరలింపుకోసం చేపడుతున్న పనులను పరిశీలించనున్నారు.ప్యాకేజీ-8లో భాగంగా చేపడుతున్న రామడుగు పంపుహౌజ్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పంపుహౌజ్‌లోనే 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటరుకు ఈ నెల 15న డ్రైరన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.

KCR inspect projects work in Karimnagar
సాయంత్రం 4.15 గంటలకు రామగుండంలోని ఎన్టీపీసీకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్న సీఎం శుక్రవారం ఉదయం 9.20కి మేడారం పంపుహౌస్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.00 గంటల వరకు పంపు హౌస్‌ను పరిశీలిస్తారు. 12.20గంటలకు రామడుగు మండలంలోని పంపుహౌస్ పనులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే భోజనం చేసి, అధికారులతో సమీక్షిస్తారు.

2.45 గంటలకు మల్యాల మండలం రాంపూర్‌లోని పంపుహౌస్ పనుల వద్దకు వెళ్తారు.3.15వరకు పంపుహౌస్ పనులను పరిశీలిస్తారు.3.40 కు మధ్య మానేరుకు చేరుకుంటారు.సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.