కేసీఆర్‌తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం..

kcr

వందశాతం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. సుప్రీం కోర్టులో ఇబ్బందులు తలెత్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తరపున లేఖ ఇచ్చామన్నారు.

రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానం అమోదించామన్నారు. అఖిలపక్షం అందరు ఒప్పుకున్నాక వెనక్కితగ్గేది లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాంట మందకృష్ణ మాదిగతో కాదన్నారు.ఆయన పని అయిపోయిందన్నారు. తెలుగు మహాసభల సందర్భంగా మందకృష్ణ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించాడని అందుకే అరెస్ట్ చేశామన్నారు.

తెలంగాణ మాదిగల వెంట కేసీఆర్ ఉన్నాడని…మీకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా ఎస్టీ వర్గీకరణ సాధించేవరకు పోరాడుతామన్నారు. చట్టాన్ని ఎవరు వ్యతిరేకించిన ఉపేక్షించేది లేదన్నారు. కేసీఆర్ ప్రాణం పోయినా తెలంగాణకు చెడ్డపేరు రానివ్వనని చెప్పారు.