రచయిత్రి సులోచనారాణి కన్నుమూత…కేసీఆర్ సంతాపం

kcr

ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) మృతి చెందారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో గుండెపోటుతో ఇవాళ మరణించింది. ఆకస్మికంగా గుండెపోటుతో తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. సులోచనారాణి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలుగు సాహితీ వికాసానికి సులోచనారాణి నవలలు ఉపయోగపడ్డాయని సీఎం పేర్కొన్నారు. సులోచనారాణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది. యద్దనపూడి సులోచనారాణి రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల సెక్రటరీ. 1964లో తొలిసారి ప్రచురణ పొందిననాటి నుంచి ఎన్నో ముద్రణలు పొంది పాఠకుల ఆదరణను పొందింది. 1970 దశకంలో యుద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన యద్దనపూడి సులోచనారాణి రచనలు అనేకం.

sulochana rani

మీనా (నవల), జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్రబంధం, జై జవాన్, ఆత్మ గౌరవం వంటి నవలలు సినిమాలుగా తీయబడ్డాయి.

రాధమధు,ఆగమనం,ఆరాధన, ఆత్మీయులు, అభిజాత,అభిశాపం,అగ్నిపూలు, ఆహుతి,అమర హృదయం,అమృతధార, అనురాగతోరణం,అర్థస్థిత,ఆశల శిఖరాలు,అవ్యక్తం,ఋతువులు నవ్వాయి,కలల కౌగిలి,కీర్తికిరీటాలు వంటి ఎన్నో నవలలు ధారావాహికలు, సీరియళ్ళుగా వచ్చాయి.