జయలలిత బయోపిక్‌..కీర్తి క్లారిటీ..!

Keerthy Suresh denies acting in Jayalalithaa biopic

లెజండరి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. తెలుగులో తొలి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం క్లాసికల్‌ హిట్‌గా నిలిచింది. సినిమాలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సావిత్రి పాత్రలో జీవించింది కీర్తి. తన హవాభావాలతో తాను తప్ప ఈ పాత్రకు మరెవ్వరు న్యాయం చేయరు అనేలా అద్భుతంగా నటించింది.ఈ నేపథ్యంలో కీర్తి సురేష్‌కు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి.

రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో కీర్తి సురేష్ నటిస్తుందన్న వార్తలు వస్తుండగానే మరో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు ముందుకువస్తున్నారు. ఇంకా ఈ సినిమాపై క్లారిటీనే రాలేదు…అప్పుడే అమ్మ బయోపిక్‌లో కీర్తి సురేష్ నటిస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్లపై స్పందించింది కీర్తి సురేష్. జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నాన్న వార్తల్లో నిజం లేదని…తనను ఎవరు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చేసింది. జయలలిత బయోపిక్‌లో తనకంటే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ నటిస్తే బాగుంటుందదని…ఆ పాత్రకు ఆమె సరిపోతుందని అభిప్రాయపడింది.ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు.