మహానటి షాకిచ్చింది !

Keerty suresh clears air on Mahanati leaked photos
Keerty suresh clears air on Mahanati leaked photos

తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. ఈ మహానటి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఎందరికో ఆసరాను అందించింది. ఇప్పుడు ఆ మహానటి జీవితం ఆధారంగా ఓ మూవీ ని తీస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో కీర్తి లుక్‌కు సంబంధించిన ఇప్పటివరకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. దీంతో సావిత్రిగా కీర్తి ఎలా కనిపించనున్నారనే విషయంపై ఆసక్తినెలకొంది. ‘మహానటి’ సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయంటూ సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్‌ చేశాయి. అయితే.. ఈ ఫోటోలు మహానటివి కావంటూ షాక్ ఇచ్చింది కీర్తి.

mahanati

ఈ ఫోటోలు మహానటి లుక్ అంటూ ప్రచారం జరుగుతుండడంతో.. పెదవి విప్పిన కీర్తి సురేష్.. ఈ ఫోటో ఓ బ్రాండ్ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో భాగం మాత్రమే. మహానటి లుక్ ఇంకా భయటకు రాలేదంటూ మళ్లీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్. సావిత్రి జీవితంపై తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఎలాంటి లీకులు కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది.

Dulquer Salmaan as Gemini Ganesan from Mahanati

కీర్తి సురేష్ తో పాటు సమంత, దుల్కర్ సల్మాన్.. విజయ్ దేవరకొండ.. లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సావిత్రిగా – కీర్తి సురేష్.. అలాగే సావిత్రి భర్త అయిన జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. సావిత్రి జీవితాన్ని ఒక దారిలో నడిపించిన ఓ వ్యక్తి పాత్రకు విలక్షణ నటుడు అయిన ప్రకాశ్ రాజ్ ని సెలెక్ట్ చేశారు. ఇకపోతే రీసెంట్ గా అర్జున్ రెడ్డి మూవీతో మంచి పేరు సంపాదించుకున్న షాలినీ కూడా నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి.