సీఎం కారు చోరి..

Kejriwal's iconic blue WagonR stolen in capital

దేశ రాజధానిలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్లూ వేగాన్ కారు చోరీకి గురైంది.ఢిల్లీలోని స‌చివాల‌యం ప్రాంగ‌ణంలోనే చోరీ కావ‌డంతో అల‌జ‌డి చెల‌రేగింది.

ఆమ్ ఆద్మీ బొమ్మతో ఉన్న ఈ కారును ప్రస్తుతం ఆప్ మీడియా సమన్వయం చేసే వందనా సింగ్.. పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు. సెక్రటేరియట్ బయట నిలిపి ఉంచిన ఈ కారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మిస్సయినట్లు గుర్తించామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ కారును 2013లో కుందన్ శర్మ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేజ్రీవాల్‌కు ఇచ్చారు. కారు చోరికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తమకు ఫిర్యాదు అందిందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ మన్‌దీప్ రద్వానా తెలిపారు.