మీకు క్రికెట్ వదిలేశా.. నాకు యాక్టింగ్ వదిలేయండి-షారుఖ్

kolkata knight rider Players Tried To Attempt Shah Rukh Khan's Dialogues

ఐపీఎల్-11 సీజన్‎లో ఆటగాళ్లు ఆటతో మాత్రమే కాకుండా.. పాటలు, డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా కోల్‎కత్తా జట్టు ఆటగాళ్లకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‎చల్ చేస్తోంది. ఆ జట్టు సహ యజమాని షారుఖ్ నటించిన సినిమాలలోని డైలాగులను చెప్పి మెప్పించే ప్రయత్నం చేశారు కోల్‎కత్తా ఆటగాళ్లు. కెప్టెన్ దినేశ్ కార్తీక్‎తో పాటు, సునిల్ నరైన్, కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లా ఆటగాళ్లు షారుఖ్ సినిమా డైలాగులు చెప్పారు. అయితే ఆ డైలాగులు చెప్పేందుకు చేసిన వారి ప్రయత్నం నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది.

 kolkata knight rider Players Tried To Attempt Shah Rukh Khan's Dialogues

అయితే ఈ వీడియో షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‎మెంట్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘వాళ్లు మైదానంలో చేసిన ప్రదర్శన మాత్రమే మీరు చూసి ఉంటారు.. కానీ ఇప్పుడు వారి రాకింగ్ ఫెర్ఫామెన్స్ చూడండంటూ.. రెడ్ చిల్లీస్ ట్వీట్ చేసింది. ఈ వీడియోను చూసిన షారుఖ్.. నా జట్టును ఎంతగానో ప్రేమిస్తున్నాను. అయితే నేను మీకు క్రికెట్‎ను వదిశాను కదా.. నాకు యాక్టింగ్ వదిలేయండి అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.

 kolkata knight rider Players Tried To Attempt Shah Rukh Khan's Dialogues

మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతోంది కోల్‎కత్తా. ఐదు జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం పారాడుతుండగా.. కోల్‎కత్తా కూడా అందులో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‎కత్తా 3వ స్థానంలో ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఐపీఎల్ చాంపియన్‎గా నిలిచింది. ఈ సీజన్‎లో కూడా చాంపియన్‎గా నిలవాలని తెగ శ్రమిస్తోంది. మంగళవారం ముంబైపై గెలిచి ప్లే ఆఫ్‌ దిశగా అడుగులు వేస్తోంది.