చిరంజీవి..కొర‌టాల సినిమాలో చ‌ర‌ణ్..

chiru, koratala, charan

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ 40శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది సైరా. ఇటివ‌లే మ‌రో షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు. సైరా మూవీకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈసినిమాకు నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్ వ్య‌వ‌హారిస్తున్నారు. దాదాపు రూ.200కోట్ల‌ బడ్జెట్ తో ఈమూవీని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈసినిమాను విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

syera

ఇక చిరంజీవి త‌రువాతి చిత్రం కొర‌టాల శివ‌తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. చిరంజీవి కోసం కొర‌టాల క‌థ‌ను కూడా సిద్దం చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే సైరా మూవీ త‌ర్వాత కొరటాల మూవీ ఉంటుందా లేక రెండు సినిమాలు చేసుకుంటూ వెళ్తారా అనే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. చిరంజీవి, కొర‌టాల శివ తీయ‌బోయే సినిమాకు ప్రోడ్యూస‌ర్ గా మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్ధ నిర్మించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

koratala, chiru

అయితే ఈసినిమా నిర్మాణంలోనూ చ‌ర‌ణ్ భాగ‌స్వామ్యం ఉంద‌నేది తాజా స‌మాచారం. మైత్రి మూవీ మేక‌ర్స్ , కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ఈసినిమాను సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఇక ఈసినిమాను చిరంజీవి ద్విపాత్రిభిన‌యం చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. రైతుగాను…బిలీనియ‌ర్ గాను న‌టించ‌నున్నాడు. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్ప‌టి నుండి రామ్ చ‌ర‌ణ్ కూడా నిర్మాత‌గా మారాడు. కొణిదెల ప్రోడ‌క్ష‌న్స్ తో ఓ సంస్ధ‌ను ఏర్పాటు చేశాడు. అటు హీరోగా ఇటు ప్రోడ్యూస‌ర్ గా రామ్ చ‌ర‌ణ్ స‌క్సెస్ పుల్ గా కొన‌సాగుతున్నాడు.