‘డర్టీ పాలిటిక్స్’ అంటున్న కొరటాల

Kortala Siva tweets create interest

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న దర్శకుడు కొరటాల శివ.  టాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ స్కాండల్ పై తనదైన శైలీలో స్పందించిన కొరటాల తాజాగా ప్రస్తుత రాజకీయాలపై బాణం ఎక్కుపెట్టాడు. రాజకీయాలు కుళ్లిపోయాయని…దేవుడు కూడా ఈ కుళ్లు రాజకీయాలను బాగు చేయలేడని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.   కేవలం మనం మాత్రమే ఈ రాజకీయాలని సరైన దారిలోకి తీసుకురాగలం ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం కూడా రాజకీయ నేపథ్యంతో కూడినదే. కొరటాల డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఓ రాజకీయ నాయకుడి పాత్రలోనే కనిపించనున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రనే పోషిస్తున్నారని సమాచారం.

మహేష్ బాబు, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు టాలీవుడ్ సూపర్ హిట్స్ లో ఒకటి అనిపించుకుంది. బాహుబలి దెబ్బకు కూడా తట్తుకొని ఆ టైం లో 100 కోట్లు కొట్టటం అంటే మామూలు విషయం కాదు. ఆ సినిమా తర్వాత మళ్ళీ పర్యావరణం సబ్జెక్ట్ తోనే ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసి పర్యావరణంపై అవగాహన కల్పించిన కొరటాల తాజాగా పాలిటిక్స్‌పై అస్త్రాన్ని ఎక్కుపెట్టడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.