రివ్యూ: కృష్ణార్జున యుద్ధం…

సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో నాని. వరుసగా ఎనిమిది హిట్ సినిమాలతో మంచి జోష్ మీదున్న నాని..కృష్ణార్జున యుద్ధంతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని డ్యుయల్ రోల్ పోషించగా అనుపమ పరమేశ్వరన్,రుక్సర్ దిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాతో నాని..త్రిభుల్ హ్యాట్రిక్ కొట్టాడా..?లేదా చూద్దాం.

కథ:

కృష్ణది చిత్తూరు జిల్లాలో ఓ రైతు కుటుంబ నేపథ్యం. అర్జున్‌ రాక్ స్టార్… వీరిద్దరికి ఎలాంటి రక్త సంబంధం ఉండదు. కృష్ణ..రియాతో లవ్‌లో పడగా అర్జున్‌…సుబ్బలక్ష్మీతో ప్రేమలో పడతాడు.వీరి ప్రేమకథ హ్యాపీగా సాగుతుండగా అనుకోకుండా ఓ సంఘటన ఎదురవుతుంది. అసలు వీరిద్దరికి ఎలాంటి సమస్య ఎదురవుతుంది..ఎలా ఎదుర్కొన్నారు..?చివరికి కృష్ణ,అర్జున్ కలిసి చేసిన కృష్ణార్జున యుద్ధం ఏంటనేది తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నాని,ట్విస్ట్స్,కామెడీ. నాని తనదైన నటనతో మెస్మరైజ్ చేశాడు. కృష్ణ,అర్జున్‌గా రెండు విభిన్న పాత్రలలో అద్భుతంగా నటించాడు. యాక్షన్‌,కామెడీ పండిస్తూ నిజంగా సహజనటుడని అనిపించుకున్నాడు. సినిమాకు మరో గ్లామర్ అనుపమ పరమేశ్వరన్. ముఖ్యంగా నాని,అనుపమ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్. మరో హీరోయిన్ రుక్సార్ పర్వాలేదనిపించింది. మిగితా నటుల్లో రవి,బ్రహ్మాజీ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

krishnarjuna yuddham movie review

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ రొటిన్ కథ. దర్శకుడు మేర్లపాక గాంధీ టేకింగ్ పరంగా ఓకే అనిపించినా కథను ఆసక్తిగా మలచడంలో తడబడ్డాడు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ త‌ర్వాత సెకండాఫ్‌పై భారీ అంచ‌నాలు ఉన్నా అవి ద‌ర్శ‌కుడు అందుకోలేదు. సెకండాఫ్‌లో స్లో న‌రేష‌న్ కూడా మైన‌స్‌.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. హిపాప్‌ అందించిన సంగీతం , బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోరు బాగుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీకి వంక పెట్టలేం. రోటిన్ కథే అయినా మేర్లపాక గాంధీ పంచ్‌ డైలాగ్‌లు,టెక్నికల్ వాల్యూస్,యాక్షన్ సీన్స్‌ తో అలరించే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

krishnarjuna yuddham movie review

తీర్పు:

నేచురల్ స్టార్ నాని నుంచి సినిమా వస్తుందంటేనే హిట్ అనే భావన ప్రేక్షకుల్లో నెలకొంది. ఎనమిది వరుస హిట్ సినిమాల తర్వాత కృష్ణార్జున యుద్ధంతో వచ్చాడు నాని. నాని నటన,కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా రోటిన్ స్టోరీ,సెకండాఫ్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే మూవీ కృష్ణార్జున యుద్ధం

విడుదల తేదీ:12/04/2018

రేటింగ్:2.5/5

నటీనటులు:నాని,అనుపమ పరమేశ్వరన్,రుక్సార్

సంగీతం:హిప్ హాప్

నిర్మాత:గారపాటి సాహు,హరీష్ పెద్ది

దర్శకత్వం:మేర్లపాక గాంధీ