టీఎస్‌ఐపాస్‌తో మైనింగ్‌ రంగంలో పెట్టుబడులు

ktr

దక్షిణ భారతదేశంలో తెలంగాణలోనే గనులు ఎక్కువగా ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సులో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణలో గ్రానైట్ గనులున్నాయని తెలిపారు. గనుల రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. త్వరలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్ధానంలో ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలన్నారు కేటీఆర్.

ఖనిజాల అన్వేషణ,తవ్వకాల్లో అధునాతన సాంకేతిక పద్దతులను ఉపయోగిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అత్యుత్తమ ఇసుక విధానాన్ని తీసుకొచ్చామన్నారు.గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త ఇసుక విధానం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా మైనింగ్ రంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. గనుకల్లో కార్మికుల రక్షణకు కొత్త చట్టాన్ని తీసుకోచ్చామన్నారు.

ktr

దేశవిదేశాల నుంచి 500 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు సదస్సు జరగనుంది. సదస్సులో గవర్నర్ నరసింహన్,కేంద్రమంత్రి తోమర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.