కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం:కేటీఆర్

ktr meet with Municipal sanitation workers

తెలంగాణ పారిశుద్ద్య కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషిచేస్తానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పారిశుద్య కార్మికుల సంఘాలతో భేటీ అయిన కేటీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లలో కార్మికులతో పనిచేయించుకుంటే అయా కమీషనర్లే భాద్యత వహించాలన్నారు. ఇలాంటి సంఘటనలను నేరుగా తనకు, తన కార్యాలయానికి సమాచారం ఇస్తే వేంటనే అయా కమిషనర్లను సస్పెండ్ చేస్తామని మంత్రి కార్మికులకు తెలిపారు.

కార్మికులు పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని, వారు నగరానికే  పని చేయాలని, అధికారులకు, ప్రజాపత్రినిధులకు కాదని తెలిపారు. కార్మికులకు అవసరం అయిన సెఫ్టీ ఎక్విప్ మెంట్ ఇచ్చామని, అవసరం అయినంత మేరకు సరఫరా చేస్తామని తెలిపారు. కానీ ఈ సామగ్రి వాడేలా కార్మికులను చైతన్యపరచాలని కోరారు.

ktr meet with Municipal sanitation workers
తమకు వేతనాలు పెంచాలని, ఈయస్ ఐ, పియఫ్ సౌకర్యాల కల్పన, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సమాన పనికి సమాన వేతనమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు, సెఫ్టీ ఎక్విప్ మెంట్ వంటి పలు డిమాండ్లను మంత్రి దృష్టికి కార్మికులు తీసుకుని వచ్చారు. తెలంగాణలో అన్ని శ్రామిక వర్గాలకు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిదన్నారు. పట్టణాల్లో పరిశుభద్రత కాపాడుతున్న పారిశుధ్ద్య కార్మికులను దేవుళ్లతో సమానంగా పోల్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  పారిశుద్ద్య కార్మికుల సమస్యలపైన అయనకు పూర్తి అవగాహన, సానూభూతి ఉందన్నారు.

పురపాలికల్లో అర్ధిక పరిపుష్టి ఉన్న మున్సిపాలిటీల్లో జీతాలు పెంచిన ఏలాంటి ఇబ్బంది ఉండదని, కానీ నగర పంచాయితీలు, చిన్న మున్సీపాలీటీల్లో ఏలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన శాఖపరంగా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చిస్తామన్నారు. జీతాల పెంచితే పురపాలక శాఖపైన పడే అదనపు అర్థిక భారం ఏంత పడుతుందో తెలిపేలా ఒక నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులకు అదేశాలిచ్చారు.

ktr meet with Municipal sanitation workers
కార్మిక నాయకులకు ఈయస్ ఐ, మరియు ప్రావిడెంట్ ఫండ్ విషయంలో చిత్తశుద్దితో ఏలాంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు సౌకర్యాల అమలు చేస్తామన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన అదేశాల అమలు విషయంలో కొంత సమయం కావాలని కోరారు. కొన్ని నెలలుగా పారిశుద్ద్య కార్మికులకు జీతాలివ్వని మున్సీపాలీటీల కమీషనర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు అవసరం అయిన మేరకు సహాకరిస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో ఇళ్లు లేని అర్హులైన పారిశుద్ద్య కార్మికులకు ఇళ్లిస్తామని మంత్రి తెలిపారు. అవసరం అయితే ప్రత్యేకంగా కోటా ఇచ్చే అంశాన్ని భవిష్యత్తులో పరిశీలన చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.