చిన్నారి ఘ‌ట‌న‌పై స్పందించిన కేటీఆర్

KTR responded to a girl made to stand in boys toilet incident
KTR responded to a girl made to stand in boys toilet incident

దేశ వ్యాప్తంగా స్కూళ్ల‌లో చిన్నారుల‌పై జరిగే అఘాయిత్యాలు, వేధింపులు మాత్రం ఆగ‌డం లేదు. రీసెంట్ గా హైద‌రాబాద్ లో ఓ చిన్నారి ని టీచ‌ర్ వేధించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. న‌గ‌రంలోని ఓ స్కూల్ కు చెందిన 11 ఏళ్ల బాలిక స్కూల్ కు యూనిఫాం వేసుకోకుండా వెళ్లింది. దీంతో స‌రైన యూనిఫాం వేసుకురాలేద‌ని బాయ్స్ టాయిలెట్స్ లో నిల‌బెట్టి ఆ అమ్మాయిని స్కూల్ టీచ‌ర్ శిక్షించాడు. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది అమాన‌వీయ ఘ‌ట‌న అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌ను రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి దృష్టికి తీసుకెళ్లి.. ఎలాగైనా స్కూల్ పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతామ‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

కాగా, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్ స్కూల్ పై కేసు న‌మోదు చేసి చిన్నారిని శిక్షించిన ఆ టీచ‌ర్ ను వెంట‌నే ఉద్యోగంలో నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని త‌ల్లిదండ్రులు, బంధువులు పాఠ‌శాల‌కు చేరుకొని ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. స్కూల్ లో ఫ‌ర్నీచ‌ర్ ను ధ్వంసం చేశారు.