You are here

అక్రమ కట్టడాలను తొలగిస్తున్నాం …

పర్యావరణ పరిరక్షణపై రాజీ పడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.  శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జీహెచ్‌ఎంసీలో వరద నీటి కాలువల వ్యవస్థపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జంట నగరాల్లో చెరువులు, నాలాలను ఆక్రమించడం వల్లే వర్షాకాలంలో ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. నాలాలపై అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామని తెలిపారు.

గతేడాది 43 లక్షల 61వేల పూడిక తీస్తే… ఈ ఏడాది 78 లక్షల పూడిక తీశామన్నారు.  ప్రతిపక్షాల సూచనలను ఆచరణలో పెడుతున్నామన్నారు. జీహెచ్ఎంసీలో చాలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న నాలాలకు యాంత్రికతను ఉపయోగిస్తున్నాం. చాలా నిబద్ధతో పని చేస్తున్నామన్నారు. 2007 -08 నుంచి రాంకీ సంస్థ చెత్త తరలిస్తుందన్నారు. సాధారణ చెత్తతో పోల్చి.. నాలాల్లో చెత్తను పోల్చి చూడలేమన్నారు. వాటి తరలింపులో కొన్ని ప్రత్యేక చర్యలు అవసరమన్నారు.

అత్యంత పేదరికంలో ఉన్నవారికి, పట్టా భూములు లేనివారికి.. డబుల్ బెడ్రూమ్ లు ఇస్తున్నామన్నారు. కిర్లోస్కర్ కమిటీ నివేదికను యథాతథంగా అమలు చెయ్యలేమన్నారు. 28వేల నిర్మాణాలు కూల్చాలని.. 12వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మెట్రో రూట్‌లో వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  త్వరలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం జరుపుతామని మంత్రి చెప్పారు.

Related Articles