లావణ్య దూకుడు పెంచిందిగా…

Lavanya Tripathi to romance this Mega Hero

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో  వున్న యంగ్ హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. లావణ్య త్రిపాటి. అందం అనుకువ అభినయం కలగలిసిన అందాలతో తన తొలి చిత్రం అందాల రాక్షసితోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్నిదోచేసింది. అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల్లో తన అభినయ కౌశలంతో అచ్చమైన తెలుగు ఇంటి అమ్మాయిలా పాత్రల్లో మెప్పిస్తూ టాలీవుడ్ లో  దూసుకెళుతుంది ఈఅమ్మడు. స్టార్ హీరోయిన్‌ అవ్వాలని తెగ ట్రై చేస్తుంది ఈ భామ.

Lavanya Tripathi to romance this Mega Hero

అయితే ఈ అమ్మడుకు సరైన అవకాశాలు రావడం లేదు. అయితే ఇప్పుడు లావణ్య చేతిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే సందీప్‌ కిషన్‌తో మయవన్‌ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో నాగచైతన్య కృష్ణ మరిముత్తు యుద్ధం శరణంలో ఈ ముద్దుగుమ్మనే తీసుకున్నారు. లావణ్య త్రిపాఠి అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో  ఈ అమ్మడికి అవకాశాలు తెగ వస్తున్నాయి.

Lavanya Tripathi to romance this Mega Hero

ఇప్పటికే పుల్ బిజీగా ఉన్న ఈ భామకు తాజాగా మరో అవకాశం వచ్చింది. వినాయక్‌ – సాయిధరంతేజ్‌ సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. నాలుగు సినిమాల్లో నటిస్తున్న లావణ్యకు ఇవన్నీ హిట్టైతే స్టార్‌ హీరోయిన్‌ అయినట్టే…