13 ఏళ్ల తరువాత ఢీ అంటున్నారు..!

LIE Movie Teaser - Nithiin, Arjun, Megha Akash | Hanu Raghavapudi | Mani Sharma - #14Reels
LIE Movie Teaser - Nithiin, Arjun, Megha Akash | Hanu Raghavapudi | Mani Sharma - #14Reels

‘ శ్రీ ఆంజనేయం’లో నితిన్ పల్లెటూరి కుర్రాడిగా .. అమాయకంగా కనిపించగా.. ఇప్పుడు ‘లై’ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. అప్పటికీ .. ఇప్పటికీ నటనలోను బాగా రాటు దేలాడు. ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ – నితిన్ తో కలిసి ‘లై’ సినిమా చేస్తున్నాడు. గతంలో నితిన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అర్జున్ హనుమంతుడుగా నటించాడు. 2004లో ‘శ్రీ ఆంజనేయం’ వస్తే .. 13 సంవత్సరాలకి మళ్లీ ఈ కాంబినేషన్ ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి) ద్వారా సెట్ అయింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్‌లో ‘కోట్లమంది సైనికులు సరిపోలేదట..పంచపాండవులూ సాధించలేదట..చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట, అశ్వాత్థామ హత:కుంజర:’ అంటూ సరికొత్తగా ఉన్న డైలాగ్ వెర్షన్ మూవీపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తున్నది.

ఈ టీజర్‌లో నితిన్‌ గడ్డం లుక్‌తో సరికొత్తగా కనిపిస్తుండగా.. అర్జున్‌ మరోసారి యాక్షన్‌కి రెడీనా అంటున్నాడు.. ఈ టీజర్‌ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అ.. ఆ.. సినిమా తరువాత నితిన్‌ భారీ యాక్షన్ చిత్రం కావడం.. దీనికి యాక్షన్ కింగ్ తోడవడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సినీ జనాలు భావిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. మేఘా ఆకాశ్ నితిన్‌కు జోడీగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.