ముద్దు కోసం కష్టపడ్డ అర్జున్‌రెడ్డి !

Lip Lock practice video of Arjun Reddy
Lip Lock practice video of Arjun Reddy

సినిమాలో ఏదైనా సీన్.. అది ఎమోష‌న‌ల్ స‌న్నివేశ‌మైనా.. రొమాంటిక్ సీనైనా.. సరే. ఆ సీన్‌ పండాలంటే ప‌దే ప‌దే ప్రాక్టీస్ చేస్తారు నటులు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ రొమాంటిక్ సీన్స్ ఇట్టే పండించేస్తాడు. అందుకే ఇమ్రాన్ కు సీరియల్ కిస్సర్ గా పేరుంది. మరి అనుభ‌వం లేని నటుల పరిస్థితి ఏమిటి..? ఖ‌చ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆ అనుభవం లేని నటుడే విజయ్ దేవరకొండ.

vijay-devarakonda-on-about-lip-lock-in-arjun-reddy

పెళ్లి చూపులు సినిమాలో తన న‌ట‌న‌తో మెప్పించిన విజ‌య్ “అర్జున్ రెడ్డి” అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో షాలిని హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో మెడికోగా నటిస్తున్నాడు విజయ్‌. ఫస్ట్‌ లుక్‌ దగ్గరి నుంచి టీజర్ వరకు సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేశాడు విజయ్. సిగిరెట్ కీ మందు కీ బానిస అయిన ఒక మెడికల్ స్టూడెంట్ క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ ఆదరగోట్టేసాడు అని ఆ టీజర్ చూసినవాళ్ళు అంటున్నారు.

ఈ మూవీలో హీరో హీరోయిన్ల మ‌ధ్య లిప్‌లాక్ సీన్ ఉంది. బీచ్ లో షాలిని పెదాలను జుర్రేస్తూ కనిపిస్తాడు విజయ్‌. అయితే ఈ సీన్ పండించేందుకు విజయ్‌-శాలినిలు టేకుల మీద టేకులు తీసుకున్నారట. ఇలా వర్కౌట్‌ అవ్వదని దర్శకుడు దగ్గరుండీ మరీ.. వీరి చేత ముద్దుల ప్రాక్టీస్ చేయించాడు.  ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.