మందుబాబులను కలచి వేసిన ప్రమాదం…

liquor

దేశ వ్యాప్తంగా మద్యం ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ధరలు పెరగడంతో మందు బాబులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి అయితే అన్నం లేకుండా అయినా ఉంటారేమో.. కానీ మందు లేకుండా ఉండలేని పరిస్థితి చాలా మందికి ఉంది. డబ్బులు లేకపోయినా.. ఉదెర తీసుకునో.. లేక అప్పు చేసే తాగేస్తుంటారు. అయితే చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం మందుబాబుల హృదయాలను కలచివేసింది. అయ్యొ బాబోయ్ అక్కడేదో.. పెద్ద ప్రమాదం జరిగి ఎవరి ప్రమాణాలో పోయాయి అనకునేరు. అలాంటి దేం లేదు.

నిండా మద్యం సీసాలు ఉన్న ఓ లిక్కర్ ట్రాలీ బండి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వందల సీసాల మందు నేల పాలైంది. ఇక ఇది చూసిన మందు బాబులు అయ్యే.. ఎన్ని సీసాలు నేలపాలయ్యాయే అనుకున్నారట. ముందే మందు రేట్లు పెరిగిపోయాయి. దీంతో వందల సీసాలు రోడ్డు పాలవ్వడంతో మందు బాబులు తెగ ఫీలయైపోయారట. ఏదేమైనా.. మందుకున్న విలువ ఈ రోజుల్లో మనుషులకు లేదనే చెప్పాలి.