లవ్వర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అంటున్న బన్నీ..

Allu Arjun's special surprise on Valentine's Day

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోగా వాలెంటైన్స్ డే కానుకగా స్పెషల్ సాంగ్‌ని విడుదల చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా సాంగ్‌ని విడుదల చేశారు. అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఫస్టు ఇంపాక్ట్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ మూవీ శాటిలైట్స్ విషయంలోనూ అల్లు వారబ్బాయి తన సత్తాచాటాడు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా 15 కోట్ల రూపాయలు పలికినట్లు సమాచారం. జీ తెలుగు ఇంతమొత్తాన్ని వెచ్చించి అర్జున్ మూవీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుందట.