100 కోట్ల ఆస్తిని వదిలి, కూతురికి దూరంగా..!!

madhya pradesh couple to become saints
madhya pradesh couple to become saints

మనిషి కోరికల్లో మోహాల్లో ధనాపేక్షే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తో౦దనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎంత సంపాదించినా.. ఆ కోరిక తీరదు.. డబ్బు పిచ్చి తలకెక్కితే తోటివాళ్లు, పనివాళ్లు అన్న తేడా ఉండదు. ఒక్క డబ్బు తప్పా.. వేరేది కనిపించదు వారికి.. సెక్స్‌ కోసం, ఫుడ్‌ కోస౦ ఉండే కోరికలా కాకుండా డబ్బు పిచ్చి తీవ్రంగా, అంతమనేది లేకుండా ఉ౦టు౦ది.

అలాంటిది కోట్ల ఆస్తిని , మోహాన్ని, సొంత బిడ్డను వదిలి సన్యాసిగా బతకడం అంటే మాటలు కాదు.. సంసార జీవితాన్ని త్యాగం చేసి, సన్యాసం పుచ్చుకోవడమంటే అత్యంత కఠిన నిర్ణయం తీసుకోవడమే.. కానీ మధ్య ప్రదేశ్‌కు చెందిన జైన్ దంపతులు వంద కోట్లకు పైగా ఆస్తిని, మూడేళ్ల కూతిరిని వదిలి జైన సన్యాసాన్ని తీసుకునేందుకు సిద్దమయ్యారు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా.. సుమిత్, అనామిక మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. 40 ఏళ్లు కూడా లేని ఈ దంపతులు తమ శేష జీవితాన్ని దైవారధనలోనే గడిపేస్తామని చెబుతున్నారు. ఈ నెల 23న సూరత్‌లో జైన్ సన్యాసులుగా మారనున్నారు.

ముందు నుంచే ఈ దంపతులు దైవారాధనకు ప్రాధాన్యతను ఇచ్చేవారని సుమిత్ బంధువు రాణిరాణా చెప్పారు. వివాహమై ఓ పాప పుట్టిన తరువాత కూడా ఈ దీక్ష తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమైనదని అన్నారు. ఇది కఠోర తపస్సు అని.. ఇది మమత, మోహాన్ని అంతం చేస్తుందని, సంసార జీవితంపై విరక్తి చెందినవారు మాత్రమే దీన్ని స్వీకరిస్తారని అన్నారు.

తమ మూడేళ్ల గారాల కూతురిని కూడా వదిలేసి సన్యాసం తీసుకోవడం అత్యంత కఠిన నిర్ణయమని స్థానికులు చెబుతున్నారు. సుమిత్ ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాడని స్థానికుడు విజయ్‌ జైన్ చెప్పారు. ఎవరి ఒత్తిడి కారణంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. ఈయనపై గురువు ప్రభావం ఎక్కువగా ఉందని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారన్నారు. ఎవరు చెప్పిన ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్దంగా లేరన్నారు.