ఈ విజయం మర్చిపోలేను:కీర్తీ సురేష్‌

KeerthySuresh

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఈ మూవీ సాధించిన విజయం అంతా ఇంతా కాదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి దూసుకుపోతోంది. ఈ సినిమాపై ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించి తన నటనతో సావిత్రిని గుర్తుకుతెచ్చారు.

KeerthySuresh

ఈ చిత్రంలో తన నటన, అభినయంతో ప్రేక్షకులను ఓ రేంజులో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ను  ఏర్పాటు చేశారు చిత్ర బృందం. ఈ సమావేంలో  నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోయిన్ కీర్తి సురేష్, హీరో విజయ్ దేవరకొండ, రచయిత బుర్రా సాయి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కీర్తీ సురేష్‌ మాట్లాడుతూ..నన్ను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్ర దర్శకుడు, నిర్మాతలు అందించిన సహకారం ఎప్పటికి మారువలేనిది. అందరు కష్టపడ్డారు కాబట్టే ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. మా అమ్మ, నాన్నల సహాకారం కూడా మరిచిపోలేనిదని  ఈ విజయం నా జీవితంలో మరిచిపోలేనిదని అన్నారు.