ఉయ్యాలవాడా..? మహావీరా..?

Mahaveera or Uyyalawada for Chiranjeevis next
Mahaveera or Uyyalawada for Chiranjeevis next

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి త‌న స్టామినా ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. ఖైదీతో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న లాంచ్ చేయడానికి కొణిదెల ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది.ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

nayanatara

ఈ సినిమాలో చిరు స‌ర‌స‌న ఇద్దరు భామ‌లు నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా న‌య‌న‌తార ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. నయన్‌తో సంప్ర‌దింపులు తుదిద‌శ‌కు చేరుకున్నాయ‌ని, ఆమె కూడా ఈ సినిమాపై ఆస‌క్తిని చూపుతున్నార‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. కానీ ఈ సినిమాకు ఎక్కువ రోజులు డేట్స్ అడ‌గ‌టంపైనే ఆమె ఆలోచిస్తున్న‌ట్లు, వాటిపై కూడా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు టాక్‌. చిరు – నయన జోడీ కట్టడం ఇదే తొలిసారి. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి ముగ్గురు సీనియర్ హీరోలతో నటించిన అనుభవం ఉండడం, ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోయే నేర్పు నయన్ సొంతం కావడంతో చిరు సరసన ‘ఉయ్యాలవాడ’లో హీరోయిన్‌గా మెప్పిస్తోందన్న ఆశాభావాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi New Look Next Movie

ఇక ఈ సినిమాకి సంబంధించిన లుక్ విషయంలో చిరంజీవి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. దర్శకుడిగా తనకి సంబంధించిన పనుల్లో సురేందర్ రెడ్డి బిజీగా వున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ విషయంలో తర్జన భర్జన పడుతోంది చరణ్ టీం.. కొందరు రాజకీయనాయకులు చిరంజీవి తన 151వ సినిమాకు సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరును పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేస్తున్నందునా.. ఈ టైటిల్‌ పెడితే అక్కడి ఆడియెన్స్‌కి కనెక్ట్‌ అవుతుందా లేదా అన్నది కూడా చరణ్ టీం ఆలోచింస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. మరొక టైటిల్‌ “మహావీర” పెట్టాలని భావిస్తున్నారట.. బాహుబలి టైటిల్‌ లా మహావీర కూడా అందరికీ కనెక్ట్‌ అవుతుందని ఈ టైటిల్‌నే రిజిస్టర్ చరణ్ చేయించినట్లు సమాచారం.