You are here

ఖైరతాబాద్‌ ఆర్టీఏలో మహేష్ సందడి..

మొన్న‌టి వ‌ర‌కు స్పైడ‌ర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న మ‌హేష్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే త‌న కారు రిజిస్ట్రేష‌న్ చేసుకునే ప‌నిలో భాగంగా మ‌హేష్ ఇవాళ ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. స్వ‌యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన మ‌హేష్ వేలిముద్ర తీసుకొని అధికారులు వాహ‌నం రిజిస్ట్రేష‌న్ చేశారు.

Mahesh at Khairatabad RTO Office
కోటీ 50 లక్షలు రూపాయలు విలువ చేసే టయోటా ల్యాండ్‌ క్రూజర్‌కు టీఎస్‌ 09 ఈవీ 4005 నెంబరును కేటాయించినట్లు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.ప్రిన్స్ రాక‌తో ఆ ప్రాంగ‌ణం అంతా సంద‌డి నెల‌కొంది.  కొంద‌రు ఆర్టీఏ ఉద్యోగులు మ‌హేష్‌తో ఫోటోలు దిగి సంతోషం పొందారు.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఖైరతాబాద్‌ ఆర్టీఏలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తనకు ఇష్టమైన బీఎండబ్ల్యూ 7సిరీస్ కారు కొనుగొలు చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆ కారు నెంబర్‌ 9999కోసం పడిన తపన అంతా ఇంతా కాదు. ఆర్టీఏ శాఖ నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.10.50 లక్షలు వెచ్చించి మరీ …. తనకెంతో ఇష్టమైన నెంబర్‌ టీఎస్‌ 09ఈఎల్‌9999ను దక్కించుకున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌.

Related Articles