ఏ హీరోకి దక్కని అదృష్టం నాది…

Mahesh at spyder pre release function

నా అభిమానుల్లాంటివాళ్లు ఏ హీరోకీ ఉండరని ప్రిన్స్ మహేష్ బాబు అన్నారు. హైదరాబాద్ శిల్పకలావేదికలో స్పైడర్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్..అభిమానుల కోసం ఎప్పుడూ మంచి సినిమాలు  చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని తెలిపారు. నా  ఫ్యాన్స్ సినిమాని నచ్చితేనే చూస్తారు లేదంటే చూడరని వాళ్లు ఎప్పుడు అలాగే ఉండాలన్నారు.

తాను ఏ దర్శకుడితో సినిమా చేసినా, అతడిని దేవుడిలానే భావిస్తానని, అంతగా నమ్మినందునే ఒక్కడు, అతడు, పోకిరి, శ్రీమంతుడు వంటి హిట్స్ వచ్చాయని ప్రిన్స్ మహేష్ బాబు వ్యాఖ్యానించారు. రెండు భాషల్లో ఒకేసారి ఒక చిత్రం చేయడం అంటే తమాషా కాదని, ఒక షాట్ తెలుగులో, మరో షాట్ తమిళంలో చేస్తూ, ఒక్కో షాట్ ను ఐదారు సార్లు చేసుకుంటూ, పర్ఫెక్ట్ గా సీన్ వచ్చంతవరకూ కష్టపడ్డామని తెలిపారు.

 Mahesh at spyder pre release function
మద్రాస్‌లో ఉన్నప్పుడు ‘దళపతి’, ‘రోజా’ సినిమా చూసి పెద్దయ్యాక సంతోష్‌గారితో సినిమా చేయాలనే ఓ కల ఏర్పడింది. మురుగదాస్‌గారి వల్ల నా కల నెరవేరింది. సూర్య ఎంతో ఎనర్జీతో చేశారు. హారిస్‌ జైరాజ్‌ సంగీతం గొప్పగా ఉంటుంది. రకుల్‌ చక్కటి సహకారం అందించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ జయదేవ్‌ గల్లా, పీటర్‌హెయిన్స్‌, ఎస్‌.జె. సూర్య, కొరటాల శివ, సుధీర్‌బాబు, ఆదిశేషగిరి రావు, దానయ్య, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, రామజోగయ్య శాస్త్రి, నమ్రత, గౌతమ్‌, సితార తదితరులు పాల్గొన్నారు.