పవన్‌ ఫ్యాన్స్‌ని మించిపోయారు..!

Mahesh Babu Fans Behaved Like Pawan Fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌  ఫ్యాన్స్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తమ అభిమాన నటుడిపై ఎలాంటి విమర్శలు చేసిన వారిపై సోషల్ మీడియా వేదికగా వారిపై చురకలంటిస్తుంటారు. తమ అభిమాన నటుడి  ఫంక్షన్‌ కాకపోయిన పవన్… సదరు వ్యక్తి మాట్లాడుతున్న సందర్భంలో పవన్‌..పవన్ అంటూ రచ్చ చేస్తుంటారు. సేమ్ ఇలాంటి సీనే రిపిటైంది మహేష్‌ స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.

దర్శకుడు సూర్య మాట్లాడేందుకు వేదికపైకి ఎక్కగానే, మహేష్ అభిమానులు గొడవకు దిగారు. అతను మాట్లాడేందుకు వీల్లేదంటూ కేకలు పెట్టారు. పెద్దగా అరుస్తూ, చేతులు అడ్డంగా ఊపుతూ తమ నిరసనలు తెలిపారు. ఆ సమయంలో తాను రెండు నిమిషాలు మాట్లాడతానని, కొంచెం సేపు ఆగాలని సూర్య కోరినా ఎవరూ వినలేదు.

అప్పుడు యాంకర్ సుమ కల్పించుకుని, దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్న సూర్య చెప్పే మాటలను మహేష్ బాబు విందామని అనుకుంటున్నారని, ఆయన ఏం చెబుతారో అందరమూ విందామని కోరింది. దీంతో గొడవ కొంత మేరకు సద్దుమణిగింది.

అయితే మహేష్ ఫ్యాన్స్…సూర్యను మాట్లాడనివ్వకపోవడానకి అసలు కారణం…నాని సినిమా. 2004లో సూర్య దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఈసినిమా బిగ్గెస్ట్  ఫ్లాప్‌గా మిగిలిపోయింది. పదమూడేళ్ల నాటి ఆ ఫ్లాప్ ఇంకా అభిమానుల మదిలో నుంచి తొలగినట్టు లేదు. అదే సూర్యపై వ్యతిరేకత రూపంలో కనిపించింది. అయితే, ఫ్యాన్స్‌ తీరుపై మహేష్ కాసింత  అసహనాన్ని ప్రదర్శించాడు. ఆయన మొహంలోని ఆహాభావాలు స్పష్టంగా కనిపించాయి.