స్పైడర్ షూటింగ్ పూర్తి

spyder-release

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా స్పైడర్. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దాదాపు ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చివరి షాట్ పూర్తయినట్టుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ లో వెల్లడించింది. షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 27న తెలుగు తమిళ భాషల్లో భారీగా సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

spyder-release

తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో భరత్ మరో విలన్ గా మెరవనున్నాడు. కాగా తమిళనాడులో ఈ రోజు భారీ ఆడియో వేడక జరుపుకోనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా స్పైడర్ విడుదలకు ముందు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు కూడా చిత్రబృందం ప్లాన్ చేస్తుంది.మహేష్ బాబు రా ఏజెంటు పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. నటుడు భరత్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

spyder-release

తెలుగు-తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్‌లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కోలీవుడ్ ఆడియెన్స్‌కి ఎన్నో హిట్ సినిమాలు అందించిన మురుగదాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటమే అందుకు కారణం.