You are here

లక్నోలో కైరాతో సూపర్‌స్టార్‌..

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఆగస్ట్‌ 11 నుంచి 22 వరకు లక్నోలో జరుగుతుంది. ఆగస్ట్‌ 9 సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్నోలో జరిగే షెడ్యూల్‌కి సంబంధించిన వివరాలు తెలియజేశారు.

Mahesh Babu’s ‘Bharath Ane Nenu’ Team Heads To Lucknow

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌లతోపాటు ప్రముఖ తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలతోపాటు పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తారు. ఈ చిత్రాన్ని జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ.

Related Articles