మహేష్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా.. టీజర్‌

Mahesh Babu's Spyder teaser on August 9

మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రేపు ‘స్పైడర్’ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. అయితే రేపు ఏ సమయంలో టీజర్ ను రిలీజ్ చేస్తారా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారట. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మహేష్‌ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల అంచనాలను మరింతగా పెంచేలా ఈ టీజర్ ను మురుగదాస్ కట్ చేశారని అంటున్నారు.

Mahesh Babu's Spyder teaser on August 9

ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్పైడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ సాంగ్‌ ‘బూమ్‌ బూమ్‌’ ఆగస్ట్‌ 2న విడుదల చేశారు. ఈ పాటలో మహేష్ జేమ్స్‌బాండ్‌లా కనిపిస్తున్నాడు. మహేష్‌ లుక్‌ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

మహేష్ కు జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు. ఎస్‌.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్‌ పూర్తయిన ఈ మూవీకి హ్యారిస్‌ జైరాజ్‌ సంగీతం అందించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.