హలో…ఐ లవ్యూ

Manasuku Nachindi Release Trailer

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ హీరోగా అమైరా దస్తూర్‌, త్రిదా చౌదరి హీరోయిన్‌గా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై పి. కిరణ్‌, సంజయ్‌ స్వరూప్‌ నిర్మించిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. రాదాన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందనరాగా తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ట్రైలర్‌లో..‘హలో బ్యూటిఫూల్ నేచర్‌.. మేము వచ్చేస్తున్నాం. మమ్మల్ని మేం తెలుసుకోవడానికి. ఐ లవ్యూ’ అని అమైరా డైలాగ్‌ చెప్పడం..ఇందుకు మహేశ్‌ బాబు వాయిస్‌ ఓవర్‌ ఇస్తూ..‘ఐ లవ్యూ టూ. ఇప్పుడే కాదు. ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను ప్రేమ అనచ్చు. ప్రకృతి అనచ్చు. నువ్వూ నేను వేరు కాదు. నువ్వు ప్రేమ, నేనూ ప్రేమ.’ అని చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..