చిన్ననాటి సావిత్రిగా…!

Manchu Laxmi daughter as Savitri
Manchu Laxmi daughter as Savitri

సావిత్రి జీవిత చరిత్రను ‘మహానటి’ పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆల్రెడీ కీర్తి సురేష్ లుక్ కూడా ఎలా ఉండబోతుందో లీక్ అయిపోయింది. చూస్తుంటే రియాల్టీకి చాలా దగ్గరగా ఉండేలా ఇప్పుడు ”మహానటి” సినిమాలో దాదాపు అందరి పాత్రలనూ తీర్చిదిద్ధినట్లున్నారు.

manchu laxmi daughter nirwana

అయితే చిన్నప్పటి సావిత్రిగా మంచు లక్ష్మీ కూతురు నిర్వాణ కనిపించనుందట. పూర్తిగా మూడేళ్లు కూడా నిడని  విద్యా నిర్వాణ తెరంగేట్రానికి మంచు లక్ష్మి ఏర్పాట్లు చేస్తోంది. మహానటి సావిత్రి జీవిత కథతో త్వరలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నిర్వాణ నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంచు లక్ష్మి స్వయంగా వెల్లడించింది.  చిత్ర నిర్మాత ,అశ్వీనీ దత్ కూతుల్ళు ప్రియాంక స్వప్నలు మంచు లక్ష్మీకి ఫ్రెండ్స్ కాగా, ఆ సత్సంబంధంతో తన కూతురిని నటింపజేయాలని అడిగిందట. దీనికి వారి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే తెలుస్తుంది.

కాగా, జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్‌ కనిసపిస్తుండగా.. మరి ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ అనే పాత్రలు ఎలా ఉండబోతున్నాయో మనం చూడాలి. అల్లుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాను మామ అశ్విని దత్ నిర్మిస్తున్నారు.